పెరిగిన మొక్కజొన్న ధరలు
వ్యవసాయ శాఖ వారి నివేదిక ప్రకారం ప్రస్తుత రబీ సీజన్లో తెలంగాణాలో మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 4.26 లక్షల ఎకరాల నుండి పెరిగి 4.42 లక్షల ఎకరాలకు చేరింది. అయితే, ఎగుమతి డిమాండ్ వలన ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఎందుకనగా, అంతర్జాతీయ మార్కెట్లో ఉక్రెయిన్ 19 శాతం సరుకు సరఫరా చేస్తున్నది.
కాని, యుద్ధం కారణంగా ఇతర దిగుమతి దేశాలు భారత్ నుండి సరుకు దిగుమతికి ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున, మధ్య ప్రదేశ్ నుండి ఎగుమతి కోసం రేక్ ద్వారా ఓడరేవు డెలివరీ రూ. 2340-2360 మరియు ఛింద్వాడా సీవానీ ప్రాంతపు ఫీడ్ రకం రూ. 2060 ధరతో వ్యాపారమయింది. ఇందులో మరో రూ. 100 వరకు పెరుగుదలకు అవకాశం కలదు. కర్నాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 20-25 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై స్థానికంగా రూ. 2000–2150, నామక్కల్, ఉడుముల్పేటై డెలివరీ 13-14 శాతం నిమ్ముసరుకు రూ. 2320 ధరతో వ్యాపారమయింది. తమిళనాడులోని కల్లకుర్చి, చిన్నసేలం, శంకరాపురం, ఉలుండర్పేట, తిరుకోవిలూరు ప్రాంతాలలో దినసరి 4-5 వేల బస్తాల రాబడిపై రూ.2100-2200, ఈరోడ్, పొలాచి డెలివరీ రూ. 2300, ట్యూటికోరిన్ డెలవరీ రూ. 2350 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. హిందూపూర్, మడకశిర, కర్నూలు ప్రాంతాలలో 3-4 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై లోకల్గా రూ. 2000-2050 ప్రతిక్వింటాలు మరియు ఈరోడ్, నామక్కల్, ఉడుముల్పేటై, బెంగుళూరు డెలివరీ బెస్ట్ క్వాలిటీ రూ. 2200–2250 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.
విజయనగరం, సాలూరు ప్రాంతాలలో 6-7 లారీల రాబడిపై రూ. 1850-1900, విజయనగరం డెలివరీ రూ.2100-2180, వరంగల్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, ప్రాంతాలలో దినసరి 10-12 వేల బస్తాల రాబడిపై రూ. 1950-2015 ధరతో వ్యాపారమయింది.
భారత్ నుండి పెరిగిన మొక్కజొన్న ఎగుమతులు
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు