దక్షిణ భారత వేలం కేంద్రాల వద్ద గత సోమవారం శనివారం యాలకులు రాబడులు క్రితం వారంతో పోలిస్తే 5, 26,033 కిలోల నుండి పెరిగి 7,35,251 కిలోల సరుకు రాబడి కాగా 7,32,031 కిలోల సరుకు విక్రయించబడింది. ఇందులో ప్రతి కిలో గరిష్ఠ ధర రూ. 929.35, కనిష్ఠ ధర రూ. 839.77 ధరతో వ్యాపారం కాగా శనివారం ధర కేవలం రూ. 20 వృద్ధి చెంది 859.51, మలివిడత వేలంలో రూ.866.29, గరిష్ఠ ధర రూ. 1271 ధరతో వ్యాపారమైంది.
2020-21 సీజన్లో చిన్న యాలకుల ఎగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే 251 శాతం ఇనుమడించి 6500 టన్నులకు చేరాయి. కాగా ఉత్పత్తి 22,520 టన్నులు నమోదైనందున ధరలు ఒడిదొడుకులకు గురికాలేదు. అయితే, ప్రస్తుత నుండి ఎడతెరిపి లేకుండా రాబడులు పోటెత్తినందున సీజన్ ప్రారంభంలో సరుకు నిల్వ చేసిన వ్యాపారులు మూటగట్టుకున్నారు. రాబోయే ఉత్పత్తి అత్యంత సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేలాలలో ఇప్పటికీ పాత కొత్త సరుకు రాబడి అవుతున్నది. కావున ఈసారి ధరలు ఇనుమడించే అవకాశం లేకపోగా అక్టోబర్ రాబడులు పోటెత్తినట్లయితే, ధరలు మరింత తగ్గగలవని సంకేతాలు అందుతున్నాయి.
పెద్ద యాలకులు : మార్చి 3న నిర్వహించిన పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటమ్ పెద్ద గింజ సరుకు ధర క్రితం వారం రూ. 676.25 నుండి తగ్గి 658.75, చిన్న గింజ సరుకు రూ.625 నుండి తగ్గి రూ.600 ప్రతి కిలోకు చేరింది. గాంగ్టక్లో పెద్ద గింజ సరుకు రూ. 675, చిన్నగింజ రూ. 575 వద్ద స్థిరపడింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ రూ. 772.50 నుండి తగ్గి రూ.750, చిన్నగింజ రూ. 663.80 నుండి తగ్గి రూ. 647.50, ప్రతి కిలో ధరతో అమ్మకమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు