మొక్కజొన్న స్థిరం

 


 లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మొక్కజొన్న ఉత్పత్తి తగ్గడంతో రాబోవు రోజులలో మంచి గిరాకీ ఉండడంతో పాటు ధరలు బలోపేతం చెందే అవకాశంతో చిన్న - పెద్ద స్టాకిస్టులతో పాటు వ్యాపారులు, రైతులు కూడా తమ సరుకు అమ్మకానికి వెనుకంజ వేస్తున్నారు.


తెలంగాణలోని మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్, కేసముద్రం ప్రాంతాలలో ప్రతి రోజు 15 వేల బస్తాల సరుకు రాబడి కాగా, స్థానికంగా రూ.2150-2350 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 100-150 టన్నుల కొత్త మొక్కజొన్న రాబడిపె స్థానికంగా రూ. 2200-2300, బెంగుళూరు డెలివరి నాణ్యమైన సరుకు రూ. 2450, విజయనగరం, సాలూరు ప్రాంతాలలో 8-10 వాహనాల సరుకు రాబడిపై రూ. 2300-2400, విశాఖపట్టణం డెలివరి రూ. 2480 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు స్వల్పంగా ప్రారంభమైంది. చింతలపూడి ప్రాంతంలో దినసరి 8-10 వాహనాల కొత్త సరుకు రాబడిపే రూ. 2225-2250, దేవరపల్లి డెలివరి రూ. 2450-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. 

కర్ణాటకలోని బళ్లారి, చల్లాకేరే, చిత్రదుర్గ్, రాణిబిందనూర్ ప్రాంతాలలో ప్రతిరోజు 10-15 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై రూ.2250-2300 మరియు మధ్య ప్రదేశ్లోని నీమచ్లో వారంలో 5 వేల బస్తాల రాబడిపై పచ్చ మొక్కజొన్న రూ. 2275-2350, మీడియం రూ. 2220-2250, నిమ్ము సరుకు రూ. 2075-2100 మరియు ఉజ్జయినిలో 6-7 వేల బస్తాల రాబడిపె రూ. 2100-2350 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని తిరుకోవిలూరు, కల్లకుర్చి, దిండిగల్, చిన్నసేలం, పొల్లాచి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు స్థానికంగా రూ. 2300-2350 మరియు ఈరోడ్, నమక్కల్ డెలివరి రూ. 2480 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు