ఉత్తరప్రదేశ్లోని ఉరైలో 3 వేల బస్తాల ఆకుపచ్చ బఠాణీల రాబడిపై రూ. 4500-4950 మరియు 2 వేల బస్తాల తెల్ల బఠాణీల రాబడిపై రూ. 4500-4900, ఝాన్సీలో 4 వేల బస్తాల రాబడి కాగా, రూ. 4500-4700, మహోబాలో ప్రతి రోజు5-6 వేల బస్తాల కొత్త బఠానీల రాబడిపై రూ. 5000-5450 ధరతో వ్యాపారమైంది.
మరియు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4875-5075, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4775-4975 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది శనగలు ధరలు క్షీణిచడం మరియు బఠాణీల ఉత్పత్తి పెరగడం వలన ధరలు దిగజారుతున్నాయి. తద్వారా ప్రస్తుతం రైతులు తమ సరుకును నెమ్మదిగా విక్రయిస్తున్నారు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు