యాలకులు

 

పెద్ద యాలకుల వేలాలు


ఏప్రిల్ 7న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ.668.75 నుండి పెరిగి రూ. 671.25, చిన్న గింజ సరుకు ధర రూ. 615 నుండి పెరిగి రూ.625 ప్రతి కిలోకు చేరగా,


 గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ.575 ప్రతి కిలో నుండి పెరిగి రూ.600 మరియు పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 770 నుండితగ్గి రూ.762.50, చిన్నగింజ రూ. 666.25 నుండి తగ్గి రూ.680 ప్రతి కిలోకి చేరింది.



చిన్న యాలకుల వేలాలు


బోడినాయకనూర్ - యాలకుల వేలం కేంద్రాలలో గత వారం జరిగిన 12 వేలాలలో 8,22,637 కిలోల సరుకు రాబడి కాగా, 7,86,437 కిలోల సరుకు అమ్మకం అయింది. ఇందులో సూపర్ గ్రీన్ రకం సరుకు వృద్ధిచెంది రూ. 2555 మరియు ఇతర నాణ్యమైన సరుకు ధరలు రూ. 1268, గరిష్టంగా రూ. 1352-1723 ప్రతి కిలో మరియు సగటున ధర గరిష్టంగా రూ. 970, కనిష్టంగా రూ. 894 ధరతో అమ్మకం అయింది. వ్యాపారస్తుల కథనం ప్రకారం వచ్చే జూన్ నెల వరకు ప్రతి వారం 7-8 లక్షల కిలోల సరుకు రాబడులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి యాలకుల ధరలు ఇప్పట్లో బలోపేతం చేందవనే చెప్పవచ్చు.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు