గతవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద సోమవారం జీలకర్ర మార్చి వాయిదా రూ. 21,560 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 855 పెరిగి రూ. 22,415, ఏప్రిల్ వాయిదా రూ. 805 వృద్ధిచెంది రూ.22,645 వద్ద ముగిసింది.
గత వారం అన్ని జీలకర్ర మార్కెట్లు మూసి ఉండగా, శుక్రవారం నాడు గుజరాత్లోని గోండల్లో 1500 బస్తాల కొత్త జీలకర్ర రాబడి కాగా, రూ.18,500-20,500, శనివారం నాడు రాజ్కోట్లో 1200 బస్తాల రాబడి కాగా, ధరలు వృద్ధిచెంది యావరేజ్ రకం రూ. 18,250-19,250, మీడియం రూ. 19250–19,750, నాణ్యమైన సరుకు రూ. 19,750-20,250, కిరాణా రకం రూ. 21,000-22,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. వ్యాపారమైంది. పెరుగుతున్న ధరల కారణంగా వారం నుండి అమ్మకం కోసం ఎదురుచూస్తున్న గుజరాత్, రాజస్థాన్ లోని మార్కెట్లకు సోమవారం నుండి రాబడులు పెరిగే అవకాశం ఉంది. మరియు ఈ సారి ఉత్పత్తి కొరవడినందున దిగ్గజ వ్యాపారులు, రెతులు నెమ్మదిగానే సరుకు విక్రయిస్తున్నారు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు