గత వారం వాయిదా మార్కెట్లో జీలకర్ర ధరలు రూ. 150-200 తగ్గాయి. అయితే ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడంతో స్టాకిస్టులు అప్రమత్తమైనందున మరియు కిరాణా వ్యాపారుల డిమాండ్ ఉన్నందున రాజస్థాన్, గుజరాత్ మొదలగు ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరిగినప్పటికీ, ధరలు రూ.400-500 పెరిగాయి. అయితే ఎన్ సిడిఇఎక్స్ వద్ద జీలకర్ర ఏప్రిల్ వాయిదా రూ.22,580 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 155 క్షీణించి రూ. 22,425, మే వాయిదా రూ. 250 పతనమై రూ. 22,635 వద్ద ముగిసింది. అయితే ఏప్రిల్ వాయిదా సెటిల్మెంట్కు ముందు మే, జూన్ వాయిదా కొనుగోలు చేయడం శ్రేయస్కరం.
గుజరాత్ లోని ఊంఝా మార్కెట్లో గత వారం 1.20 నుండి 1.25 లక్షల బస్తాల కొత్త జీలకర్ర రాబడి పై యావరేజ్ సరుకు రూ. 18,500-18,700, మీడియం రూ. 18,800-19,000, నాణ్యమైన సరుకు రూ.22,000-23,400 మరియు రాజ్కోట్లో 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మీడియం రూ. 19,125-19,875, నాణ్యమైన సరుకు రూ.19,875-20,375, యూరప్ రకం రూ.20,375 21,000 మరియు గోండల్ 10-11 వేల బస్తాల సరుకు మీడియం రూ. 18,000–18,500, నాణ్యమైన సరుకు రూ. 19,300-22,800, జామ్నగర్లో 8-10 వేల బస్తాల రాబడి కాగా, మీడియం 19,000–19,200, నాణ్యమైన సరుకు రూ.20,500-21,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
రాజస్థాన్లోని మెడతాలో గత వారం 45-50 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 14,000-15,000, మీడియం రూ. 16,500–17,000, నాణ్యమైన సరుకు రూ. 18,000 – 21,000, సూపర్ ఫైన్ రూ. 24,000–26,000, జోధ్పూర్లో 10-12 వేల బస్తాలు, కేక్ లో 1000-1200 బస్తాల రాబడి కాగా, రూ. 17,000 – 21,000, ఫలోది, సాంచోర్, నోఖా, బికానేర్ ప్రాంతాలలో 7-8 వేల బస్తాలు, కిషనడ్లో 700-800 బస్తాల రాబడి కాగా మీడియ రూ. 17,500–18,500, నాణ్యమైన సరుకు రూ. 21,000-21,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు