వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో అలసందల రాబడులు పెరగడంతో మరియు ధరలు అధికంగా ఉండడంతో ఈ ఏడాది స్టాకిస్టులు ముందుకు రావడం లేదు. దీనితో ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో శనగల ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అలసందల వినియోగం తగ్గడంతో మహారాష్ట్ర వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. దీనితో ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.
కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, ముందర్గి, హరిసెకేరే, మెస్తూరు, హగరిబమ్మనహల్లి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో ప్రతిరోజు 800-1000 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై గులాబీ రకం రూ. 6500-7200, మీడియం రూ. 6000-6200 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 1000 బస్తాల రాబడిపై ఎగుమతి డిమాండ్ కొరవడడంతో ధర రూ. 150-200 తగ్గి రూ. 4600-4700, గొట్లగట్టులో 800 బస్తాల రాబడిపే రూ. 4650 మరియు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం ఎగుమతి అయింది. కడప జిల్లాలోని రాయచోటిలో నలుపు సరుకు రూ.5200-5500, తెలుపు రూ. 4900-5000, ఎరుపు రకం రూ. 5000–5100, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్ ప్రాంతాలలో దినసరి 500 బస్తాల రాబడిపై రూ. 5000-5200 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు