పెరిగిన జీలకర్ర రాబడులు

 


గతవారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో పాటు ఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం జీలకర్ర ఏప్రిల్ వాయిదా రూ.22,330 తో ప్రారంభమై బుధవారం నాటికి రూ. 200 క్షీణించి రూ. 22,130, మే వాయిదా రూ. 160 పతనమై రూ. 22,340 వద్ద ముగిసింది. అయితే స్థానిక మార్కెట్లలో ధర రూ. 250-300 వృద్ధిచెందింది.


వ్యాపారస్తుల కథనం ప్రకారం మే వాయిదాలో మరో రూ. 1000 వృ ద్ధిచెందే అవకాశం ఉంది. ఎందుకనగా గుజరాత్, రాజస్థాన్లలో ఉత్పత్తి క్షీణిస్తున్నందున స్టాకిస్టులు అప్రమత్తమయ్యారు.


గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం సుమారు 1 లక్ష బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అయింది. కాగా వచ్చే వారం వరకు సుమారు 2 లక్షల బస్తాల సరుకు రాబడి అయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా రాజస్థాన్లో సుమారు 60-65 వేల బస్తాల సరుకు రాబడి అయింది. మరో వారంలో 1 లక్ష బస్తాలకు చేరే అవకాశం ఉంది. సీజన్లో రికార్డు ధరల వలన రైతుల సరుకు అమ్మకాలు పెరుగుతున్నాయి.


ఊంఝా మార్కెట్లో సోమవారం నుండి బుధవారం వరకు 80-85 వేల బస్తాల సరుకు రాబడి పై రూ. 200-300 వృద్ధిచెంది యావరేజ్ సరుకు రూ. 18,000–18,500, మీడియం రూ. 18,600-18,800, నాణ్యమైన సరుకు రూ. 22,000–23,000 మరియు రాజ్కోట్లో 6-7 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై యారేజ్ రూ. 17,500-18,250, మీడియం రూ. 18,750-19,500, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, యూరప్ రకం రూ. 20,000-21,750 మరియు గోండల్లో 4-5 వేల బస్తాల సరుకు మీడియం రూ. 19,200-19,500, నాణ్యమైన సరుకు రూ. 20,000–22,400, జామ్నగర్లో 4-5 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 18,000–18,700, నాణ్యమైన సరుకు రూ. 20,500-21,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 రాజస్థాన్లోని మెడతాలో గత వారం 35-40 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 13,000-14,000, మీడియం రూ. 17,500-18,000, నాణ్యమైన సరుకు రూ. 20,000-21,000, సూపర్ ఫైన్ రూ. 24,000-26,000, కేక్ లో 400-500 బస్తాల రాబడి కాగా, రూ. 17,000-20,500, జోధ్పూర్ 6-7 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 17,500-18,500, నాణ్యమైన సరుకు రూ 21,000-22,000, కిషన్డ్లో 800-1000 బస్తాల రాబడి కాగా మీడియం రూ. 18,000-19,000, నాణ్యమైన సరుకు రూ. 21,000-23,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు