భారత ప్రభుత్వం కందులు, మినుములు స్వేచ్చా దిగుమతి విధానాన్ని సవరిస్తూ, 2023 మార్చి 31 వరకు పొడిగించింది. తద్వారా మయన్మార్లో సరఫరా పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక స్టాకిస్టులు వ్యాపారుల ద్వారా అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎఫ్ఎక్యూ మినుములు 80 డాలర్లు వృద్ధిచెంది 930 డాలర్లు, ఎస్యూ 1025 డాలర్ ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ముంబైలో ఎఫ్ఎక్యూ పాత మరియు కొత్త సరుకు రూ.500 పెరిగి రూ. 7000, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6850, ఎస్క్యూ రూ.7700, దిల్లీలో ఎస్యూ రూ. 7800-7875, ఎఫ్ఎక్యూ రూ. 7100-7150, కోల్ కతాలో ఎఫఎక్యూ రూ. 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం భారతదేశంలోని రబీ, యాసంగి సీజన్లలోని ఉత్పాదకులకు మద్దతు ధరలకు ధీటుగా అధిక ధరలు లభించే అంచనా కలదు.
తమిళనాడులోని విల్లుపురం, విరుధాచలం, దిండివనం, తిరుకోవిలూరు, ఉలుండూరుపేటె, పెన్నతూరు ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 4-5 వేల బస్తాల రాబడిపై కొత్త సరుకు రూ. 6000-6800, మీడియం డ్యామేజ్ సరుకు రూ. 4000-5500 లోకల్ లూజ్ మరియు తంజావూరు సరుకు చెన్నై డెలివరి రూ. 7100, విల్లుపురం ప్రాంతపు నాణ్యమైన సరుకు రూ. 7300, క్రిష్ణా జిల్లాలోని బోల్డ్ పాలిష్ సరుకు చెన్నై డెలివరి రూ.7200, సాదా రూ.6800 ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు