ప్రభుత్వ పంటల అంచనా కమిటీ (సిఇసి) వారి కథనం ప్రకారం రెండవ యాసంగి పంటల అంచనాలో 2021-22లో దక్షిణాఫ్రికాలో మొక్కజొన్న ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 163.15 ల.ట. నుండి 10 శాతం తగ్గి 146.84 ల.ట. లకు చేరే అంచనా కలదు. ఎందుకనగా దేశంలో మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 27.55 ల.హె. నుండి తగ్గి 26.23 ల.హె.లకు చేరింది. అమెరికా వ్యవసాయ శాఖవారి నివేదిక ప్రకారం ఈ ఏడాది అమెరికాలో విస్తీర్ణం 1.5 శాతం తగ్గినప్పటికీ, చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (సిబిఒటి)లో మొక్కజొన్న వాయిదా ధర 1.23 శాతం తగ్గి 7.475 డాలర్లు ప్రతి బుషెల్ కు చేరింది. అయితే ఆఫ్రికాలో ఉత్పత్తి కూడా తగ్గుచున్నది.
భారతీయ మొక్కజొన్న ఎగుమతులు పెరగడంతో కర్ణాటక మార్కెట్లలో ప్రతి రోజు 18-20 వేల బస్తాల మొక్కజొన్న రాబడి కాగా, స్థానికంగా రూ. 2150-2310, నమక్కల్, ఉడుమల్పేటె డెలివరి రూ. 2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. బిహార్లోని పూర్ణియా, గులాబ్బాగ్, దర్భంగా ప్రాంతాలలో విస్తీర్ణం పెరిగింది. కొన్ని ప్రాంతాలలో పంట కోతకు సిద్ధంగా ఉంది. అయితే 15 ఏప్రిల్ తరువాత కోతలకు అవకాశం కలదు. త్వరలో సరుకు రాబడులు ప్రారంభం కాగలవు. ఎగుమతిదారులు కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఎందుకనగా బిహార్ నుండి కోల్కత్తా కోసం లారీ అద్దె తక్కువగా ఉంది.
తమిళనాడులోని కల్లకుర్చి, చిన్నసేలం, శంకరాపురం, ఉలుండరుపేట,తిరుకోవిలూరు ప్రాంతాలలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2200-2400, ఈరోడ్, పొల్లాచి కోసం రూ. 2600, టూడి డెలివరి రూ. 2500 మరియు దిండిగల్లో దినసరి 2-3 లారీల రాబడి కాగా, రూ.2200-2400, నమక్కల్ డెలివరి రూ.2500, రాజపాలయం, కోవిల్పట్టి ప్రాంతాలలో 1-2 వాహనాల రాబడి కాగా, రూ. 2200–2300, ఈరోడ్, పొల్లాచి, నమక్కల్ డెలివరి రూ.2450-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్ ని హిందూపూర్, మడకశిర, కర్నూలు ప్రాంతాలలో 15-20 వాహనాల కొత్త మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ.2100-2300, పుంగనూరు డెలివరి రూ. 2550, చిత్తూరు డెలివరి రూ.2550-2570, ఈరోడ్, నామక్కల్, ఉడుమల్పేట, బెంగుళూరు డెలివరి నాణ్యమైన సరుకు రూ.2500-2550 ధరతో వ్యాపారమైంది. తెనాలి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాలలో ఏప్రిల్ రెండవ వారం నుండి కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. చింతలపూడి ప్రాంతంలో దినసరి 5-6 వాహనాల కొత్త సరుకు రాబడిపై రూ. 2200-2250, దేవరపల్లి డెలివరి రూ. 2450-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. విజయనగరం, సాలూరు ప్రాంతాలలో 8-10 వాహనాల సరుకు రాబడిపె రూ. 2300-2350, విజయనగరం డెలివరి రూ. 2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది.
తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, కేసముద్రం ప్రాంతాలలో దినసరి 20 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2200-2300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమచ్ వారంలో 2 వేల బస్తాల రాబడిపై పచ్చ మొక్కజొన్న రూ. 2275-2310, మీడియం రూ. 2215-2230, నిమ్ము సరుకు రూ. 2050–2100 మరియు ఉజ్జయినిలో 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 200-2350 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు