బలపడుతున్న మొక్కజొన్న ధరలు

 

ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ప్రతి రోజు  5-6 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా ప్రతి క్వింటాలు రూ. 2300-2350, లోడింగ్ కండిషన్ సరుకు రూ. 2500, గుంటూరులో నిల్వ అయిన సరుకు 2-3 వ్యాగన్ల మొక్కజొన్న లోడింగ్ కండిషన్ రూ.2330 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఏలూరు, విజయవాడ, నమ్మక్కల్ కోసం వ్యాపారమైంది. విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 10-12 వాహనాల సరుకు అమ్మకంపై స్థానికంగా రూ. 2450-2460, అనకాపల్లి డెలివరి రూ.2550, హిందూపూర్, నంద్యాల, మడకశిర రాబడులు క్షీణించి ప్రతి రోజు 1-2 వాహనాల సరుకు రాబడి పై రూ. 2400-2450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరె, బళ్లారి, రాణిబెన్నూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై రూ. 2400-2500, ఝార్ఖండ్లోని రాంచీ, లోహర్రాగా, హజారీబాగ్ ఉత్పాదక ప్రాంతాలలో ప్రతి రోజు 1800-2000 బస్తాల యాసంగి మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ.2300-2350, కటక్ డెలివరి రూ. 2450-2500, బీహార్ లోని బెగుసరాయ్, ఖగాడియా, గులాబ్ ్బగ్, దర్భాంగా, పూర్ణియా, సీతామడి ప్రాంతాల మార్కెట్లలో 10-12 వేల బస్తాల రాబడిపై రూ. 2350-2400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్లోని కోల్కతా కోసం రవాణా అవుతున్నది. 

తమిళనాడులోని దిండిగల్లో ప్రతి రోజు 40-50 వాహనాల మొక్కజొన్న అమ్మకంపై రూ. 2400-2450, ఒట్టవన్ చత్రం, అరియలూరు, పెరంబూరు ప్రాంతాలలో 10-15 వాహనాలు రూ. 2425-2450, ఉడుముల్పేట, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 2600-2630, వేదారణ్యం, కల్లకుర్చి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 30-40 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2350-2450, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 2630-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని నీమచ్లో 800-1000 బస్తాలు పచ్చ మొక్కజొన్న రూ. 2450-2500, మీడియం రూ. 2350-2400, గజ్జర్ రకం రూ.2300-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog