తగ్గిన వరి సేద్యం - ఎగుమతి డిమాండ్ తో ఎగబాకుతున్న ధరలు

 బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ - అరబ్ లాంటి దేశాల నుండి బియ్యం కోసం నెలకొన్న డిమాండ్ మరియు దేశంలోని పలు ఉత్పాదక రాష్ట్రాలలో వరి సేద్యం తగ్గినట్లు అందుతున్న సంకేతాలు వెరసి జూన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు బియ్యం ధరలు దాదాపు 30 శాతం పైకి ఎగబాకాయి.



ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వరిసేద్యంలో ఈసారి వెనుకబడగా,ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్,ఝార్ఖండ్ సంతృప్తికరమైన వర్షాలు కురవనందున సేద్యం నత్తనడకేసింది.తూర్పు మరియు ఉత్తరాది రాష్ట్రాలలో కలిసి వరి సేద్యం 37 ల.హె. తగ్గినట్లు సంకేతాలు అందుకున్న బంగ్లాదేశ్ సోనా మసూరి బియ్యం భారత్ నుండి కొనుగోలు చేయడం ప్రారంభించింది. తద్వారా ధరలు 20 శాతం మేర అధిగమించాయి. 

దేశంలో వరి సేద్యం జూలై 29 నాటికి 13.3 శాతం క్షీణించినట్లు విశ్వసనీయ సమాచారం.ఇరాన్, ఇరాక్, సౌదీ అరబ్ నుండి డిమాండ్ వెల్లువెత్తుతున్నందున బాస్మతి బియ్యం ధర ప్రతి క్వింటాలు రూ. 6200 నుండి 30 శాతం ఇనుమడించి రూ. 8000 కు ఎగబాకింది. 2021-22 ఖరీఫ్ సీజన్ కోసం 11.20 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధారించగా శీతాకాలంతో పాటు 2022 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి దాదాపు 13 కోట్ల టన్నులకు చేరగా ఇందులో 2.10 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి చేయబడ్డాయి.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు