ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సేద్యం

 


 ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జల వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ఖరీఫ్ సీజన్ సాధారణ విస్తీర్ణం 38.96 ల.హె.కు గాను ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 18.83 ల.హె.కు విస్తరించింది. 


రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, కడప, అన్నమయ్య, శ్రీకాకుళం మరియు గుంటూరు జిల్లాలలో 25-50 శాతం, ఎన్టీఆర్, నంద్యాల, అనంతపురం, ఏలూరు, చిత్తూరు, క్రిష్ణ, కాకినాడ కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలలో 51-75 శాతం, సత్యసాయి, తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరులో 76-100 శాతం సేద్యం 100 శాతం విస్తరించగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో సేద్యం ఇప్పటికీ 25 శాతానికి కూడా చేరలేదు. అయితే, సేద్యం ప్రక్రియ శరవేగంతో చేపడుతున్నారు. రాబోయే రోజులలో నిర్ధారిత లక్ష్యం చేరుకోగలదని ఆంధ్రప్రదేశ్ అగ్రి-మిషన్ . అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తుల పంపిణీ ప్రక్రియ అత్యంత చురుకుగా కొనసాగుతున్నదని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. స్వల్పకాలిక పంటలైన పప్పు ధాన్యాలు, వేరుసెనగ, నువ్వులు, పత్తి, చెరకు వంటలు అత్యంత సంతృప్తికరంగా వికసిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు