రాబోయే సీజన్లో పత్తి సరరఫరా కుంటుపడే అవకాశం

 

 
Cotton, cotton seed, పత్తి

గడిచిన ఐదేళ్లుగా పత్తి వార్షిక సగటు సేద్యం 126 ల.హె.కు విస్తరిస్తుండగా, ఈ ఏడాది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 2 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 117.68 ల.హె. నుండి పెరిగి 125.69 ల.హె.కు విస్తరించింది. సేద్యం ప్రక్రియ దాదాపు ముగిసినట్లే భావించవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది.


దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో సెప్టెంబర్ 2 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే

 మహారాష్ట్రలో 39,36,500 హెక్టార్ల నుండి పెరిగి 42,29,400 హెక్టార్లు, 

ఆంధ్రప్రదేశ్ లో 4,81,000 హెక్టార్ల నుండి 5,88,000 హెక్టార్లు,

 కర్ణాటకలో 6,27,600 హెక్టార్ల నుండి 8,12,500 హెక్టార్లు,

 గుజరాత్ లో 22,51,200 హెక్టార్ల నుండి 25,45,100 హెక్టార్లు, 

రాజస్తాన్ లో 6,28,900 హెక్టార్ల నుండి 6,52,100 హెక్టార్లు, 

ఒడిశ్శాలో 1,96,200 హెక్టార్ల నుండి 2.16 ల.హె., 

తమిళనాడులో 21,900 హెక్టార్ల నుండి 29,800 హెక్టార్లకు విస్తరించగా 

పంజాబ్ లో 2,54,100 హెక్టార్ల నుండి తగ్గి 2,48,000హెక్టార్లు, 

హర్యాణాలో 6,88,000 హెక్టార్ల నుండి 6,50,500 హెక్టార్లు, 

తెలంగాణలో 20,45,000 హెక్టార్ల నుండి 19,72,000 హెక్టార్లు, 

మధ్య ప్రదేశ్ లో 6 ల.హె. నుండి 5.99 ల.హె., 

ఉత్తరప్రదేశ్ లో 37,100 హెక్టార్ల నుండి 25,700 హెక్టార్లకు పరిమితమైంది.

దేశంలోని కొన్ని పత్తి ఉత్పాదక ప్రాంతాలలో అతివృష్టి వలన పంటకు నష్టం వాటిల్లిందని తద్వారా 2022-23 సీజన్ లో దేశంలో పత్తి సరఫరా కుంటుపడే అవకాశం ఉందని వ్యాపారులు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. ధరలు తాత్కాలిక ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం పలుకుతున్న పత్తి ధరలను దృష్టిలో పెట్టుకొని 130 ల.హె. విస్తరించగలదని భావించగా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.

పెరిగిన పత్తి సేద్యం పరిధి, పంజాబ్ లో వృద్ధి చెందుతున్న కొత్త సరుకు రాబడులు మరియు పంట పరిస్థితి అత్యంత ఆశాజనకంగా ఉందనే అందుతున్న సంకేతాల మధ్య ధరలు కొంతమేర డీలా పడ్డాయి.

గుజరాత్ లో ప్రతి కండీ (356 కిలోలు) ధర ఎ గ్రేడ్ పత్తి రూ. 92,00093,000, బి గ్రేడ్ రూ. 90,000-91,000, గింజలు ప్రతి క్వింటాలు రూ. 3250-3900 మరియు మహారాష్ట్రలో రూ. 9500-11,000, పత్తి గింజలు రూ. 3700-3900 ప్రతి క్వింటాలు మరియు 30 మి.మీ. పొడుగుపింజ ప్రతి కండీ పత్తి రూ. 89,500- 90,500, అకోలో 29 మి.మీ. పత్తి రూ. 85,000-86,000, ఖాన్ దేశ్, మరాట్వా డలో రూ. 85,000-87,000 ప్రతి కండీ ధరతో వ్యాపారమైంది.

తెలంగాణలోని వరంగల్ లో 30 మి.మీ. పొడుగుపింజ పత్తి రూ. 92,00093,000, భైంసాలో 29 మి.మీ. పత్తి రూ. 90,000-93,000 ప్రతి కండీ మరియు ప్రతి క్వింటాలు రూ. 9500-10,400, పత్తి గింజలు రూ. 3200-3900, ఆదోనిలో పత్తి రూ. 86,000-89,000, గుంటూరులో 80,000-84,000, మరియు క్వింటాలు రూ. 9000-10,700 పత్తి గింజలు రూ. 3000-3800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు