గత నెల నుండి గుజరాత్, రాజస్థాన్లలో సోంపు అమ్మకాలు తగ్గినప్పటికీ, ధరలు బలోపేతం చెందడం లేదు.
ఎందుకనగా ఉత్పాదక కేంద్రాల వద్ద సమృద్ధిగా నిల్వలు ఉండడంతో పాటు స్థానిక వ్యాపారుల కొను గోల్లు తమ అవసరానికి అనుగుణంగా ఉండడం వలన గుజరాత్ లోని ఊంఝా మార్కెట్ లో గత వారం 4-5 వేల బస్తాల సోంపు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 9500-10,500, మీడియం రూ. 12,000–12,500, నాణ్య మైన సరుకు రూ. 14,000-15,000, రాజస్తాన్ లోని మెడతా, పాలి,జోధ్ పూర్ మరియు ఇతర ఉత్పాదక మార్కెట్లలో యావ రేజ్ సరుకు రూ. 9500-10,500, మీడియం రూ. 11,000–11,500, మీడియం బెస్ట్ రూ. 13,500–14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు