ప్రస్తుత సీజన్ లో సెప్టెంబర్ 2 వరకు దేశంలో మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 80.37 ల.హె. నుండి పెరిగి 81.52 లక్షల హెక్టార్లకు చేరింది. వ్యాపారస్తుల అంచనా ప్రకారం రబీ సీజన్ లో కూడా విస్తీర్ణం పెరగవచ్చు. గుజరాత్ లో ఆగస్టు 29 వరకు విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవ ధితో పోలిస్తే 2,92,759 హెక్టార్ల నుండి 2,87,781 హెక్టార్లకు చేరింది. సెప్టెంబర్ 1 వరకు తెలంగాణలో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,08,862 ఎకరాల నుండి తగ్గి 6,05,954 ఎకరాలకు చేరింది.
ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ప్రతి రోజు 6-8 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా ప్రతి క్వింటాలు రూ. 2300-2400, లోడింగ్ కండిషన్ సరుకు రూ. 2500 ధరతో వ్యాపారమె ఏలూరు, విజయవాడ, నామక్కల్ ప్రాంతాల కోసం రవాణా అవుతోంది. విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 10 వాహనాల సరుకు అమ్మకంపై స్థానికంగా రూ. 2450, అనకాపల్లి డెలివరి రూ. 2500-2550, హిందూపూర్, నంద్యాల, మడకశిర ప్రాంతాలలో ప్రతి రోజు 8-10 వాహలనాల సరుకు రాబడిపై రూ. 2400-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరె, బళ్లారి, రాణి బెన్నూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 6 వేల బస్తాల మొక్కజొన్న రాబడి పై రూ. 2500–2600, ఝార్ఖండ్ లోని రాంచీ, లోహర్ దాగా, హజారీబాగ్ ఉత్పాదకప్రాంతాలలో ప్రతి రోజు 2 వేల బస్తాల యాసంగి మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2400-2450, కటక్ డెలివరి రూ. 2500-2600,
బీహార్ లోని బెగుసరాయ్, ఖగాడియా, గులాబ్ బాగ్, దర్భాంగా, పూర్ణియా, సీతామడిప్రాంతాల మార్కెట్ లో 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 2400-2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా కోసం రవాణా అవుతున్నది.
తమిళనాడులోని దిండిగల్ లో ప్రతి రోజు 20-25 వాహనాల మొక్కజొన్న అమ్మకంపై రూ. 2400-2450, ఒట్టవన్ చత్రం, అరియలూరు, పెరంబూరు ప్రాంతాలలో 10 వాహనాలు రూ. 2400-2450, ఉడుముల్ పేట, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 2675-2700, వేదారణ్యం , కల్లకుర్చి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 30 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2400-2450, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 2650-2700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్ లోని నీముచ్ లో 1000-1500 బస్తాలు పచ్చ మొక్కజొన్న రూ. 2380-2400, మీడియం రూ. 2300-2320, గజ్జర్ రకం రూ. 2300-2400, తెల్ల మొక్కజొన్న రూ. 2570 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు