పెరిగిన పసుపు వాయిదా వ్యాపారుల అమ్మకాలు
లభించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మర ఆడించే యూనిట్ల వద్ద సమృద్ధిగా నిల్వలు ఉన్నందున మరియు పసుపు వ్యాపారంలో పోటీ పెరిగిన నేపథ్యంలో సరఫరా పెరగడంతో ధరలు పెరగడం లేదు. వాయిదా మార్కెట్లో కూడా కొనుగోలుదారులు నెమ్మదిగా బయటపడుతున్నారు. దీనితో మార్కెట్ తో పాటు వాయిదా ధరలు రూ. 100-150 ప్రతిక్వింటాలుకు తగ్గాయి.
లభించిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర రైతుల వద్ద ఇప్పటికీ సరుకు నిల్వలు ఉన్నాయి మరియు గత రెండేళ్ల మాదిరిగా నవంబ ర్-డిసెంబర్ వాయిదా ధరలు పెరగగలవని వీరు ఆశాభావంతో ఉన్నారు. అయితే మర ఆడించే యూనిట్లు మరియు పెద్దవ్యాపారులు చురుకుగా మారారు మరియు తమ సరుకు విక్రయిస్తున్నారు. ఎందుకనగా, దీపావళికోసం కేవలం 45-50 రోజుల సమయం ఉంది. దీని తరువాత గిరాకీ తగ్గగలదు. కావున, ధరలు పెర గడం అసంభవంగా కనిపిస్తున్నది. ఎసిడిఇఎ లో సోమవారం సెప్టెంబర్ వాయిదా రూ. 7240 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 110 తగ్గి రూ. 7130 మరియు అక్టోబర్ వాయిదా రూ. 96 తగ్గి రూ. 7274 తో ముగిసింది. వ్యవసాయ శాఖ అధికారుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 1, సెప్టెంబర్ వరకు పసుపు పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,841 హెక్టార్ల నుండి 10 శాతం పెరిగి 14,104 హెక్టార్లకు చేరింది. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6952 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 1561 హెక్టార్ల నుండి పెరిగి 1693 హెక్టార్లకు, గుంటూరు జిల్లాలో 1823 హెక్టార్ల నుండి 1180 హెక్టార్లకు, వై ఎస్ ఆర్ కడప జిల్లాలో 1563 హెక్టార్ల నుండి 1077 హెక్టార్లకు చేరగా, విశాఖపట్నంలో గత ఏడాది విస్తీర్ణం 6403 హెక్టార్లు ఉంది.
నిజామాబాద్ లో గతవారం 4-5 వేల బస్తాల రాబడిపె కొమ్ము రూ. 6500-7300, గట్టా రూ. 5800-6300 లోకల్ లూజు మరియు లారీ బిల్టీ పాలిష్ కొమ్ము రూ. 7900-8000, పాలిష్ గట్టా రూ. 7000-7100 మరియు బంగ్లాదేశ్ కోసం కొమ్ము రూ. 7000-7100 మరియు వరంగల్ లో 250-300 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 6200, గట్టా రూ. 5300-5800, కేసము ద్రంలో 700-800 బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5000-6000, గట్టా రూ. 5000-5300 ధరతో వ్యాపారమయింది. మహారాష్ట్రలోని సాంగ్లీలో 4-5 వేల బస్తాల అమ్మకంపై రాజా పురి రూ. 7000-8000, దేశీ కడప రూ. 6000-6700, నాందేడ్ లో 3-4 వేల బస్తాల అమ్మకంపై రూ. 6000-6700, గట్టా రూ. 5800-6100, బస్మత్ నగర్ లో 3 వేల బస్తాల అమ్మకంపై కొమ్ము రూ. 6000-6500, గట్టా రూ. 5500-6000 ధరతో వ్యాపారమయింది.
తమిళనాడులోని ఈరోడ్లో గతవారం 8-10 వేల బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5659-7355, గట్టా రూ. 5212-6569, పెరుంద రెల్లో 2000-2500 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5509-7574, గట్టా రూ. 5022-6739, గోపీ చెట్టిపాలయంలో 300-400 బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5702-7699, గట్టా రూ. 5702-6889 ధరతో వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు