దేశంలోని ఉత్పాదక కేంద్రాలు, వ్యాపారులు మరియు స్టాకిస్టుల వద్ద పేరుకుపోయిన పసుపు నిల్వలు మరియు క్షీణించిన కొనుగోళ్లతో ధరలు మందగమనంలో చలిస్తున్నాయి.ఎన్ సిడిఇఎక్స్ వద్ద గత మంగళవారం సెప్టెంబర్ వాయిదా రూ. 6864 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 136 పెరిగి రూ. 7000, అక్టోబర్ వాయిదా రూ. 150 వృద్ధి చెంది రూ. 7244 వద్ద ముగిసింది. వ్యాపారులు మరియు రైతు ఉత్పాదక సమాఖ్య (ఎ పిఒ) మధ్య పసుపు వ్యాపారం పోటాపోటీగా నడుస్తోంది. పసుపు వ్యాపారానికి సంబంధించి అనేక సమస్యలను ఏకరువు పెడుతూ వాయిదా వ్యాపారం నుండి పసుపు పంటను మినహాయించాలని మరట్వాడ, విదర్భ టర్మరిక్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఇందుకోసం పసుపు వాయిదా వ్యాపారంపై ఆంక్షలు విధించకూడదని మహారాష్ట్ర పరివర్తన్ ఆర్గానిక్ ఎపిసి మరియు హింగోళి సూర్య పిఎఫ్ సి రాసిన లేఖలో ఎన్ సిడిఇఎ కు చెందిన పిఎసి ని కోరింది. అంతేకాకుండా ఈ సమస్యను కేంద్ర సర్కారుకు నివేదించాలని కూడా సలహా ఇచ్చింది. ఎ పిఒ విజ్ఞప్తి చేసిన తర్వాత పసుపు వ్యాపారంపై ఎన్ సిడిఇఎ కు చెందిన పిఎసి కూడా వాయిదా వ్యాపారం జాబితా నుండి తొలగించకూడదని ప్రభుత్వాన్ని కోరింది. వ్యాపారులు ఆంక్షలు విధించాలని కోరుతున్నందున వారికి అవగాహన కల్పించాలని సలహా ఇచ్చింది.దేశంలో 2021-22 పసుపు ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే11.24 ల.ట. నుండి 18 శాతం వృద్ధి చెంది 13.31 ల.ట.కు చేరింది. రెండు రైతు సంఘాలు కలిసి 1200 రకాలను ఉత్పత్తి చేశాయి. పసుపు 9 నెలల పంట అయినందునుడాది పొడుగునా రైతులు దీనిపై ఆధారపడుతున్నారని రైతు సమాఖ్య పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు ఎ పిఒ లు పసుపు వాయిదా వ్యాపారం చేపడుతున్నాయని ఎక్స్ంజి వేదిక వద్ద ప్రత్యక్షంగా సరుకు డెలివరి చేస్తున్నట్లు పిఎసి ఛైర్మన్ పూనమ్ చంద్ గుప్తా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరడకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వాయిదా వలన ధరల స్థితిగతులపై అవగాహన ఏర్పడుతున్నందున రైతులకు ప్రయోజనం చేకూరగలదని తెలిపారు. పంట నూర్పిళ్లకు ముందే మార్కెట్ ను వ్యూహాత్మకంగా మలచవచ్చని కూడా గుప్తా పేర్కొన్నారు.
తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం మహారాష్ట్ర నుండి 4-5 వేల బస్తాల సరుకు రాబడి కాగా ధర రూ. 100-200 క్షీణించి కొమ్ములు రూ. 6200-7200, దుంపలు రూ. 5800-6200 లోకల్ లూజ్ మరియు కొమ్ములు పాలిష్ సరుకు లారీ బిల్టి రూ. 7900-8000, దుంపలు రూ. 7000-7100, బంగ్లాదేశ్ కోసం కొమ్ములు రూ. 7100-7200,
వరంగల్ లో 200-300 బస్తాలు కొమ్ములు రూ. 5500-5800, దుంపలు రూ. 5000-5300, కేసముద్రం మార్కెట్ లో 400-500 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 4500-5800, దుంపలు రూ. 4500-5500 మరియు
ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో 1800-2000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు మరియు దుంపలు రూ. 5200-5700, టేకూరిపేట రూ. 5800-5900, పుచ్చు సరుకు రూ. 4500-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో బుధవారం 8-10 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 5800-6600, దుంపలు రూ. 5500-6200, సాంగ్లీలో 4-5 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు రూ. 7000-8000, దేశీ కడప రూ. 6500-6800 మరియు నాందేడ్లో 7-8 వేల బస్తాలు రూ. 6000-7000, దుంపలు రూ. 5800-6200 ఇదే విధంగా
బస్మత్ నగర్ లో 2-3 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-6200, దుంపలు రూ. 5500-6000, ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది.
తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్ లో గత వారం 14-15 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6000-7481, దుంపలు రూ. 5419-6910, పెరుందురైలో 3-4 వేల బసాలు కొమ్ములు రూ. 5400-7631, దుంపలు రూ. 5099–6829 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు