రాగులు

  
Fingermillets,రాగులు,

ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 2 వరకు దేశంలో రాగుల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిసేత 8.31 ల.హె. నుండి తగ్గి 7.51 లక్షల హెక్టార్లకు చేరింది. తెలంగాణలో విస్తీర్ణం 592 ఎకరాల నుండి పెరిగి 612 ఎకరాలకు చేరింది. 


కర్ణాటకలోని అరిసెకేరిలో ప్రతి రోజు 400-500 బస్తాలు, బెంగుళూ రులో 600 బస్తాల రాగుల రాబడిపై రూ. 1650-1800, ఎరుపు రకం రూ. 2800-3000, నాగమంగళ, కొత్తూరు, చింతామణి, దావణగెరె, హర్సనహళ్లి ప్రాంతాలలో 1500-2000 బస్తాలు రూ. 1500-1800, శిమోగాలో 90-100 బస్తాలు ఎరుపు రకం రూ. 2600-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, సాలూరు ప్రాంతాలలో గత వారం 3 వాహనాల రాగుల అమ్మకంపై లోడింగ్ కండిషన్ రూ. 2100-2140 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు