ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 16 వరకు దేశంలో సజ్జల విస్తీర్ణం 63.29 ల.హె. నుండి పెరిగి 69.89 లక్షల హెక్టార్లకు చేరింది.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 500-800 బస్తాల కొత్త సజ్జల రాబడిపె రూ. 2000-2300 మరియు కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 400 బస్తాల సజ్జల రాబడిపై రూ. 2200-2600, కుష్ఠగిలో 2-3 వేల బస్తాల రాబడిపె రూ. 2000-2100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
అలసందలు : కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో రూ. 5700, నాణ్యమైన సరుకు రూ. 5800-6100, రెయిన్ టచ్ రూ. 5200-5400 మరియు కుష్టగిలో గతవారం 500-600 బస్తాల రాబడిపె రూ. 6800, కొప్పల్ లో 200-300 బస్తాల రాబడిపె రూ. 6500-6700 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రలోని రాయచో టిలో నిల్వ అయిన నలుపు రకం అలసందలు రూ. 5500-5600, ఏరుపు రకం రూ. 5000, తెల్లవి రూ. 5400, పొదిలిలో దినసరి 2-3 వాహనాల అమ్మకం కాగా, రూ. 5400 ధరతో వ్యాపారమెంది.
ఉలువలు : కర్ణాటకలోని మైసూరులో రూ. 6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కేరళ కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో నిల్వ అయిన సరుకు విజయవాడ డెలివరి రూ. 6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. విజయనగరం, సాలూరు ప్రాంతాలలో తెల్ల ఉలు వలు రూ. 5900, నలుపు రకం రూ. 5600 ధరతో వ్యాపారమె తాడేపల్లిగూడెం కోసం స్వల్పంగా వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు