ప్రస్తుత సీజన్ లో సెప్టెంబర్ 16 వరకు దేశంలో సజ్జల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలి స్తే 63.29 ల.హె. నుండి పెరిగి 69.80 లక్షల హెక్టార్లకు చేరింది. మొక్కజొన్న విస్తీర్ణం 81.26 ల.హె. నుండి పెరిగి 82.99 ల.హె.,జొన్నలు 14.64 ల.హె నుండి తగ్గి 13.96 ల.హె., రాగులు 9.59 ల.హె. నుండి తగ్గి 8.56 ల.హె. లకు చేరింది. కర్ణాటక మరియు తూర్పు - దక్షిణ ఆంధ్రలలోని కొన్ని ప్రాంతా లలో పంట కోత లు ప్రారంభము య్యాయి. మరో 20-25 రోజులలో రాబడులు పెరగగలవు. కొత్త సీజన్ లో ఎగుమతులకు అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో ధర రూ. 2200 స్థాయిలో ఉంది.
ఆంధ్రలోని విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగా, రూ. 2350-2400, అనకాపల్లి డెలివరి రూ. 2450, హిందూపూర్, నంద్యాల, మడకశిర ప్రాంతాలలో ప్రతి రోజు 10-15 వాహలనాల సరుకు రాబడిపై రూ. 2350-2400, బెంగుళూరు డెలి వరి రూ. 2550-2600 మరియు గుంటూరు, తెనాలి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు 15-20 లారీల అమ్మకం కాగా, నావుక్కల్ కోసం లారీబిల్టీ రూ. 2400 ధరతో వ్యాపారమెంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరె, బళ్లారి, రాణి బెన్నూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 7-8 వాహనాల మొక్కజొన్న రాబడి పై రూ. 2200-2450, ఝార్ఖండ్ లోని రాంచీ, లోహర్ దాగా, హజారీబాగ్ ఉత్పాదప్రాంతాలలో యాసంగి మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2250-2350, కటక్ డెలివరి రూ. 2400-2450 ధరతో వ్యాపారమెంది.
తమిళనాడులోని దిండిగల్ లో ప్రతి రోజు 30-40 వాహనాల మొక్కజొన్న అమ్మకంపై రూ. 2150-2200, ఒట్టవన్ చత్రం, అరియలూరు, పెరంబూరు ప్రాంతాలలో 25-30 వాహనాలు రూ. 2150-2200, ఉడుముల్ పేట, నమక్కల్ , ఈరోడ్ డెలివరి రూ. 2300-2350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్ లోని నీమచ్ లో గత వారం 2-3 వేల బస్తాలు పచ్చ మొక్కజొన్న రూ. 2300-2350, మీడియం రూ. 2200-2220, గజ్జర్ రకం రూ. 2300, తెల్ల మొక్కజొన్న రూ. 2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు