దేశంలో ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 9 నాటికి మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 80.52 ల.హె. నుండి పెరిగి 82.16 ల.హె.కు విస్తరించగా ఉత్పత్తి 63.25 ల.ట. నుండి పెరిగి 70.51 ల.ట.కు చేరినందున మొత్తం ముతక ధాన్యాలు 180.44 ల.ట.కు చేరింది. ఇందులో జొన్న సేద్యం 14.47 ల.హె. నుండి తగ్గి 13.94 ల.హె., రాగులు 9.24 ల.హె. నుండి 8.22 ల.హె.కు విస్తరించగా ఇందులో తెలంగాణలో గుజరాత్ లో 2,92,764 హెక్టార్ల నుండి తగ్గి 2,87,825 హెక్టార్లకు పరిమితం కాగా తెలంగాణలో 6,11,649 ఎకరాల నుండి పెరిగి 6,14,978 ఎకరాలకు విస్తరించింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు, తెనాలిలో నిల్వ అయిన సరుకు లారీ బిల్టి నమక్కల్ డెలివరి ప్రతి రోజు 25-30 వాహనాల సరుకు అమ్మకంపై ప్రతి క్వింటాలు రూ. 2400-2430, విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల కొత్త సరుకు ప్రారంభమైనప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మార్కెట్లకు సరుకు రాబడి కావడంలేదు. తద్వారా స్థానిక మార్కెట్లలో రూ. 2375-2400, అనకాపల్లి డెలివరి రూ. 2500, హిందూపూర్, నంద్యాల, మడకశిర 8-10 వాహలనాల సరుకు రాబడి పై స్థానికంగా రూ. 2400-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరె, బళ్లారి, రాణిబెన్నూర్ప్రాంతాలలో ప్రతి రోజు 6-7 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై రూ. 2200-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఝార్ఖండ్ లోని రాంచీ, లోహర్ దాగా, హజారీబాగ్ ఉత్పాదక ప్రాంతాలలో ప్రతి రోజు 1000 బస్తాల యాసంగి మొక్కజొన్న రాబడిపై రూ. 2300-2350, కటక్ డెలివరి రూ. 2400-2500, బీహార్ లోని స్థానిక మార్కెట్లలో రూ. 2280-2350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని దిండిగల్ లో ప్రతి రోజు 10-15 వాహనాల
మొక్కజొన్న రాబడిపై స్థానిక మార్కెగట్లలో రూ. 2400-2450, ఒట్టవని చత్రం, అరియలూరు, పెరంబూరు ప్రాంతాలలో 10-12 వాహనాలు రూ. 2380-2420, ఉడుముల్ పేట, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 2600–2670 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్ లోని నీమచ్ లో 600-700 బస్తాలు పచ్చమొక్కజొన్న రూ. 2300-2400, మీడియం రూ. 2250-2300, గజ్జర్ రకం రూ. 2350-2400, తెలుపు రూ. 2590 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు