అధిక నిల్వల వలన తగ్గిన మెంతుల ధరలు

 

Fenugreek, మెంతులు

 మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రముఖ మెంతుల ఉత్పాదక రాష్ట్రాలలో భారీగా సరుకు నిల్వలు ఉన్నందున మరియు పంట విత్తే సమయం చేరువలో ఉండడం వలన స్టాకిస్టుల అమ్మకాలు పెరుగుతున్నాయి. 


తద్వారా మధ్య ప్రదేశ్ లోని జావ్రాలో గత వారం 17–18 వేల బస్తాల మెంతుల రాబడిపై రూ. 4000-4100, మీడియం రూ. 4500-5000, మీడియం బెస్ట్ రూ. 5200-5500, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, నాణ్యమైన ఫాఫ్ రూ. 8000-8500 మరియు 

నీమ్ లో 8-10 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 3800-4000, మీడియం రూ. 4200-4500, నాణ్యమైన సరుకు రూ. 5000-5500, బోల్డు సరుకు రూ. 6000-6200, మందసోలో 800-1000 బస్తాలు రూ. 4500-4800,

 రాజస్తాన్లోని కోటా, బారన్, రామ్ గంజ ముండి, బికనీర్, నోఖా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 800-1000 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 3800-4000, మీడియం రూ. 4100-4200, నాణ్యమైన సరుకు రూ. 4500-4600 మరియు 

గుజరాత్ లోని రాజ్కో ట్లో 1800-2000 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5800-6000, మీడియం రూ. 5450-5700, యావరేజ్ రూ. 5200-5300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం