దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పాదక రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంటకు ప్రయోజనం చేకూరగలదు. అయితే ఇంతుకు మించి కురుసినట్లయితే పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుత సీజన్లో జూన్ 1 - సెప్టెంబర్ 7 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సాధారణంతో పోలిస్తే 453 మి.మీ. నుండి 458 మి.మీ. వర్షపాతం నమోదైనందున సెప్టెంబర్ 7 నాటికి పసుపు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.5 శాతం పెరిగి 14,540 హెక్టార్లకు చేరగా ఉత్పాదక ప్రాంతాలలో స్టాకిస్టుల అమ్మకాలు ఒత్తిడికి గురైనందున మసాలా గ్రౌండింగ్ యూనిట్లు మరియు వ్యాపారులు తము ఆవశ్యకతానుసారమే సరుకు కొనుగోలు చేస్తున్నారు.
ఎన్ సిడిఇఎక్స్ లో సోమవారం సెప్టెంబర్ వాయిదా రూ. 7100 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 254 తగ్గి రూ. 6846 మరియు అక్టోబర్ వాయిదా రూ. 134 తగ్గి రూ. 7090 వద్ద ముగిసింది.
నిజామాబాద్ లో మార్కెట్లో సోమ, గురువారాలలో కలి సి 3 వేల బస్తాల అమ్మకంపై కొమ్ములు రూ. 6400-7400, దుంపలు రకం రూ. 5500-6200 లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ కొమ్ములు రూ. 8000-8100, పాలిష్ దుంపలు రూ. 7100-7200 మరియు బంగ్లాదేశ్ కోసం కొమ్ములు రూ. 7200-7300 మరియు వరంగల్ లో 150-200 బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 5800-6000, దుంపలు రూ. 5000-5500, కేసముద్రంలో 300-400 బస్తాల రాబ డిపె కొమ్ములు రూ. 5000-6000, దుంపలు రూ. 4500-5200 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు