బలహీనపడుతున్న మెంతుల ధరలు
మధ్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ లాంటి మెంతుల ఉత్పాదక రాష్ట్రాలలో ఒత్తిడికి గురవుతున్న రాబడులతో వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-300 పతనమైంది.
మధ్య ప్రదేశ్లోని జావ్రాలో 40-45 వేల బస్తాల మెంతుల రాబడిపై యావరేజ్ సరుకు రూ. 5500-5800, మీడియం రూ. 6000-6200, నాణ్యమైన సరుకు రూ. 6500-6800, పాప్ రూ. 7200-7500 మరియు నీవుచ్ లో 18-20 వేల బస్తాలు యావరేజ్ రూ. 5000–5200, మీడియం రూ. 5500-6200, మీడియం బెస్ట్ రూ. 6400–6600, నాణ్యమైన బోల్డు సరుకు రూ. 6800-7200, మందసోర్ 5-6 వేల బస్తాలు మీడియం రూ. 5000-5400, నాణ్యమైన సరుకు రూ. 6000-6300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
గుజరాత్ లోని రాజ్కోట్లో 5-6 వేల బసాలు యావరేజ్ రూ. 5700–5900, మీడియం రూ. 6050-6300, నాణ్యమైన సరుకు రూ. 6350-6550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
రాజస్తాన్ లోని కోటా మార్కెట్లో 6-7 వేల బస్తాల కొత్త మెంతులు రాబడి కాగా నిమ్ము సరుకు రూ. 3500-4000, మీడియం బెస్ట్ రూ. 5800-5950, ఎండు సరుకు రూ. 6100-6200, రామ్ంజ్మండి, కోటా, బారన్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 3-4 వేల బస్తాలు, నోఖాలో 2-3 వేల బస్తాలు నిమ్ము సరుకు రూ. 4000-4500, ఎండు సరుకు రూ. 5500-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు