పసుపు వాయిదా ధరలు తగ్గే సూచన

  

మసాలా బోర్డు వారి వివరాల ప్రకారం గత ఏడాది దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగి 13.30 లక్షల టన్నులకు చేరింది. . వ్యాపారస్తుల అంచనా ప్రకారం కొత్త సీజన్లో భారీగా నిల్వలు ఉన్నందున మరియు ఎగుమతి డిమాండ్ ఉన్నప్పటికీ, స్టాకిస్టులు ముందుకు రావడంలేదు. ఎందుకనగా, ఇంతవరకు నిజామాబాద్లో 8 లక్షల బస్తాలు మరియు సాంగ్లీలో 7 లక్షల బస్తాలతో పాటు తెలంగాణా మరియు మహారాష్ట్రలలోని ఇతర మార్కెట్లలో సరుకు రాబడులు గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఉన్నాయి.


లభించిన సమాచారం ప్రకారం దేశంలోని కొన్ని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో వర్షాల వలన సరుకు నాణ్యత ప్రభావితం కావడంతో చిన్న తరహా మర ఆడించే యూనిట్ల డిమాండ్ తగ్గడం మరియు పుచ్చు రకం సరుకు లభ్యత పెరగడానికి అవకాశం కలదు. దీనితో, ఆంధ్ర, తెలంగాణా, మహారాష్ట్ర మార్కెట్లలో ధరలు రూ. 200-250 తగ్గాయి. దీనితో వాయిదా ధరలు కూడా తగ్గే అవకాశం కలదు. ఏప్రిల్, 2022 నుండి ఫిబ్రవరి, 2023 వరకు విదేశాలకు పసుపు ఎగుమతులు ముందు సంవత్సరంలోని ఇదే వ్యవధితో పోలిస్తే 1,37,017టన్నుల నుండి పెరిగి 1,51,298 టన్నులకు చేరాయి. ఇందులో ఫిబ్రవరి, 2023లో ఎగుమతులు జనవరి, 2023 తో పోలిస్తే 12,484 టన్నుల నుండి 18.60 శాతం పెరిగి 14,806 టన్నులకు చేరాయి. ఎన్సిడిఇఎక్స్లో గత సోమవారం పసుపు మే వాయిదా రూ. 6690 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 32 పెరిగి రూ. 6722, జూన్ వాయిదా రూ. 18 పెరిగి రూ. 6782 తో ముగిసింది.


నిజామాబాద్లో గతవారం 28-30 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5500-6400, గట్టా రూ. 4800-5400, పాలిష్ కొమ్ము రూ. 7000, గట్టా రూ. 6100 మరియు మెట్పల్లిలో 2-3 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 3500–5400, గట్టా రూ. 3200-4900, కేసముద్రంలో 700-800 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 4400-5500, 

దుగ్గిరాలలో 7-8 వేల బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 4800–5200 ధరతో వ్యాపారమయింది. 

మహారాష్ట్రలోని హింగోలి, బస్మత్నగర్, నాందేడ్, సాంగ్లీ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 75-80 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5300-5800, గట్టా రూ. 4700-5500, నాణ్యమైన కొమ్ము మరియు గట్టా రూ. 6000-6400, సాంగ్లీలో 14-15 వేల బస్తాల రాబడిపై రాజాపురి రూ.6200-7200, మీడియం రూ.5800-6300, దేశీ కడప రూ. 5400-5800, పౌడర్ రకం రూ. 9000-9300 ధరతో వ్యాపారమయింది.

 తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో వారంలో 22-25 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5309-6309, గట్టా రూ. 4909-5888, పెరుందరె, గోబిచె ట్టి పాలయంలో 700-800 బస్తాల రాబడిపై రూ. 4600-5700 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు