మధ్యప్రదేశ్ లో పెరిగిన కొత్త మిరప రాబడి - గత వారం మార్కెట్ ధరలు
11-10-2021 గుంటూరు మార్కెట్లో గత వారంలో కోల్డుస్టోరేజీల నుండి 5 లక్షల బస్తాలు మరియు హిందూపూర్లో దాదాపు 1500 బస్తాల కొత్త సరకు రాబడితో పాటు మధ్యప్రదేశ్లో 25-27 వేల బస్తాల కొత్తసరుకు రాబడి కాగా, మరో 15 రోజులలో కర్నాటకలో కొత్త సరుకు రాబదులు పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు సాధ్యమైనంత త్వరగా బయటపడాలని చూస్తున్నారు. దీనితో ధరల పెరుగదల పరిస్థితి సమాప్తమయింది.