Posts

పత్తి ధరలకు లభిస్తున్న మద్దతు

Image
  18-10-2021 ఈ ఏడాది పంజాబ్లో పత్తి సేద్యం భారీగా విస్తరించినప్పటికీ కీటక సంక్రమణం వలన ఉత్పత్తి కొరవడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తద్వారా కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5925 అధిగమించి రూ. 7700 కు చేరింది. భారత పత్తి సంస్థ (సిసిఐ) మరియు భారత పత్తి సమాఖ్య లిమిటెడ్ (ఐసిఎఎల్) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలలో మొత్తం పత్తి సేద్యం 17.96 ల.హె. నుండి తగ్గి 16.99 ల.హె.కు పరిమితమైంది. ఇందులో పంజాబ్లో 52 వేల హెక్టార్లు వృద్ధి చెంది 3.03 ల.హె., హర్యాణాలో 49 వేల హెక్టార్లు తగ్గి 6.88 ల.హె., రాజస్తాన్లో 1 ల.హె. తగ్గి 7.08 ల.హె., గుజరాత్లో ఎగువ ప్రాంతంలో 3.44 ల.హె. మరియు దిగువ ప్రాంతంలో 6.64 ల.హె.కు విస్తరించింది.

తగ్గిన యాలకుల రాబడులు - ధరల వివరాలు

Image
  18-10-2021 గత వారం దక్షిణాది రాష్ట్రాలలోని వేలం కేంద్రాల వద్ద దసరా పండుగ వలన మసాలా బోర్డు వద్ద నాలుగు రోజులు మాత్రమే వేలాలు నిర్వహించబడ్డాయి. ఇందులో 3,90,697 కిలోలు సరుకు రాబడిపై ధరలు చౌకగా ఉన్నందున రాబడి అయిన సరుకులో 13-14 వేల కిలోలు మాత్రమే అమ్మకం కాలేదు.యాలకుల పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. గత వారం కేరళలోని పలు జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసినందున పంట కోతలకు జాప్యం ఏర్పడింది. 

సోయా చిక్కుడుకు మందగమనం ముగిసినట్లే

Image
  18-10-2021 అక్టోబర్ 25 తర్వాత దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో సోయాచిక్కుడు రాబడులు  పోటెత్తనున్నాయని తెలుస్తోంది. సోయాచిక్కుడు సేద్యం విస్తృతంగా చేపట్టినప్పటికీ ఉత్పత్తి తగ్గగలదని కేంద్ర ప్రభుత్వం మరియు కొందరు నూనెగింజల వ్యాపారులు అంచనా వ్యక్తమవుతున్నది.  ఎందుకనగా, కొన్ని ప్రాంతాలలో కుండపోత వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో వర్షాల లేమితో పంటకు నష్టం వాటిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంటనూనెల ధరలను దృష్టిలో పెట్టుకొని కొన్నింటిపై దిగుమతి సుంకం ఎత్తివేయగా రిఫైండ్ నూనెలపై తగ్గించింది. ప్రస్తుతం క్రషింగ్ మిల్లులకు సాధారణ కొనుగోళ్లు ప్లాంట్ డెలివరి ధర తగ్గి రూ.5200-5400 వద్ద కదలాడుతున్నది. తద్వారా ధర గరిష్ఠంగా రూ. 200-300 తగ్గే అవకాశం ఉంది. తత్ఫలితంగా సోయాచిక్కుడు ధరలకు మందగమన ఛాయలు తొలగినట్లేనని భావించవచ్చు. 

రబీ సీజన్లో విస్తృతంగా "ఆవాల" సాగు

Image
  18-10-2021 ఆవాలకు గిట్టుబాటవుతున్న లాభసాటి ధరలు, సానుకూల వాతావరణం వలన రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రముఖ ఆవాల ఉత్పాదక రాష్ట్రాలలో రైతులు రబీ సీజన్ కోసం ఆవాల సేద్యం విస్తృతంగా చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, గోధుమ మరియు శనగ స్థానంలో ఆవాల సేద్యం చేట్టడానికి అత్యంత అనుకూలంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. 

పసుపు అమ్మకాలకు సిద్దమవుతున్న స్టాకిస్టులు - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 అన్ని ఉత్పాదక కేంద్రాలలో భారీగా పసుపు నిల్వలు ఉన్నందున మరియు మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున ధరల పెరుగుదలకు అవకాశాలు సమాప్తమయ్యాయి. జనవరి మొదటి వారంలో మిగులు నిల్వలు మరియు కొత్త సీజన్లో ఉత్పత్తి కలిసి 2022 డిసెంబర్ వరకు వినియోగంతో పోలిస్తే అధికంగా ఉండే అవకాశమున్నందున చిన్న స్టాకిస్టులు బయట పడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

పెసలు ధరలు పెరిగే అవకాశం - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 దేశంలో ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రమైన రాజస్తాన్లో ఈ ఏడాది పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. అయితే, ఉత్పాదకులకు మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ.7275 కు గాను రూ. 5000 -6600 నాణ్యతానుసారం లభ్యమవుతున్నది. తద్వారా రాజస్తాన్ ప్రభుత్వం నవంబర్ 1 నుండి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.

దేశంలో ఊపందుకున్న కొత్త వేరుశనగ రాబడులు - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 దేశంలోని ప్రముఖ వేరుశనగ ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం  రాజస్థాన్ లోని బికనీర్, జోధ్ పూర్ ప్రాంతాలలో వారంలో 70-80 వేల బస్తాలు,  ఆంధ్ర, కర్నాటకలలో 75-80 వేల బస్తాలు,  గుజరాత్ లక్ష బస్తాలు,  ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దినసరి 20-25 వేల బస్తాలు, మౌరానీపూర్, కరేలీ, మహోబా, ఛత్తర్పూర్ ప్రాంతాలలో 70-80 వేల బస్తాలు సహా దాదాపు లక్ష బస్తాల రాబడిపై 7-8 శాతం తేమ మరియు 65-70శాతం గింజ కండీషన్ సరుకు రూ. 4500-5000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.