Posts

తగ్గిన వాము ఉత్పత్తి

Image
   రాబోయే సీజన్ లో వాము ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నందున ధరలు ఇనుమడిస్తున్నాయి. ఈ ఏడాది సరుకు నిల్వలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో పంటకు తీరని నష్టం వాటిల్లినందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 40-45 శాతం తగ్గగలదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రైతులు వాము పంటను పెకలించి ఇతర పంటల సాగు చేపడుతున్నారు.

దిగిరానంటున్న జీలకర్రవాయిదా ధరలు

Image
   చైనా, బంగ్లాదేశ్ నుండి జీలకర్ర కు డిమాండ్ బలహీన పడినప్పటికీ వాయిదా ధరలు తగ్గడం లేదు. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో 4-5 నెలల సమయం ఉంది. సేద్యం ప్రక్రియ మరో 1-2 వారాలలో ప్రారంభం కానున్నది. ప్రస్తుత సీజన్ లో ఉత్పత్తి కుండటుపడినందున సీజన్ ప్రారంభం నుండే ధరలు ఇనుమడిస్తున్నందున పలువురు దిగ్గజ రైతుల సరుకు అమ్మకం కాలేదు. 

వృద్ధి చెందుతున్న పత్తి పంట - అడుగంటుతున్న నిల్వలు

Image
  ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పాదక దేశమైన భారత్ లో అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన ప్రస్తుత పత్తి సీజన్ (2022-23) కోసం దేశంలో పత్తి ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 12 శాతం ఇనుమడించి 3.44 కోట్ల బేళ్ల (ప్రతి బేలు 170 కిలోలు) కు చేరగలదని ప్రముఖ పత్తి వ్యాపార సమాఖ్య పేర్కొన్నది. కొత్త సీజన్ మిగులు నిల్వలు గత సీజన్ తో పోలిస్తే 71.80 లక్షల బేళ్ల నుండి తగ్గి 31.90 లక్షల బేళ్లతో ప్రారంభమైంది. 

రబీ మొక్కజొన్నకు పెరుగుతున్న ఆదరణ

Image
 ప్రస్తుత సీజన్ లో అక్టోబర్ 21 నాటికి దేశంలో ముతక ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.45 ల.హె. నుండి పెరిగి 2.45 ల.హె.కు విస్తరించింది. ఇందులో మొక్కజొన్న 43 వేల హెక్టార్ల నుండి 65 వేల హెక్టార్లు, జొన్న 95 వేల హెక్టార్ల నుండి 1.65 ల.హె., రాగులు 5 వేల హెక్టార్ల నుండి 10 వేల హెక్టార్లు మరియు బార్లీ 1000 హెక్టార్ల నుండి పెరిగి 5 వేల హెక్టార్లకు విస్తరించింది. 

ఆముదాల రాబడి

Image
  ఆదోనిలో వారంలో 10-15 వేల బస్తాల కొత్త ఆముదాల రాబడిపె రూ. 5950-6080, గిద్దలూరు, వినుకొండ ప్రాంతాలలో 4 లారీల రాబడిపై రూ. 5900-6000 మరియు కర్నూలు, ఎమ్మిగనూరు తదితర మార్కెట్లలో కలిసి వారంలో 15-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై 

పెరుగుతున్న నువ్వుల రాబడులు - విస్తృతమవుతున్న రబీ సేద్యం

Image
   ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో దినసరి 20 వేల బస్తాల రాబడి అవుతోంది. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా సరుకు నిమ్ముతో పాటు డిస్ కలర్ కావడంతో ధరలు తగ్గి గ్వాలియర్లో 99.1 రకం రూ. 12,800-12,900, హల్లింగ్ రూ. 12,500-12,600, ఆగ్రాలో హళ్లింగ్ సరుకు రూ. 12,400-12,500, కాన్పూర్ లో హళ్లింగ్ సరుకు 12,600-12,800, ముంబైలో తెల్లనువ్వులు సార్టెక్స్ రూ. 13,700, ముంద్రా డెలివరి రూ. 13,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

పెరిగిన శనగల మద్దతు ధర

Image
  గత వారం ఖరీఫ్ సీజన్ లోని ఆరు పంటల మద్దతు ధరలను పెంచుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానంతం ప్రకటించింది. ఇందులో శనగల కోసం ప్రస్తుతం ఉన్న రూ. 5230 నుండి రూ. 105 పెంచి రూ. 5335 ప్రతి క్వింటాలుకు నిర్ధారించింది. శనగ సేద్యం పురోగతిపై గత వారమే రాజస్తాన్ నుండి నివేదిక అందింది. రాబోయే సీజన్ లో బఫర్ నిల్వలకోసం కేంద్ర ప్రభుత్వం కందులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపార వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాయి.