గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్లో రికార్డు స్థాయిలో మిరప సాగైన తరువాత భారీ వర్షాలతో పాటు చీడపీడల బెడద కారణంగా దిగుబడితో పాటు పంట ఉత్పత్తి తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు అధికంగా ఉన్నాయి. తేజ డీలక్స్ ధర రూ. 18,000 వరకు చేరినప్పటికీ, రాబోవు సీజన్ కోసం రెతులు ఎక్కువగా ముందుకు రావడం లేదు. ఎందుకనగా ధరలు పెరిగినప్ప టికీ, విక్రయించడం వలన మొత్తం ధర లభించకపోవడంతో రైతులు పత్తి, మొక్క జొన్న మొదలగు పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా నాణ్యమైన రకాల తక్కువగా ఉండడంతో ప్రముఖ వ్యాపారులు భవిష్యత్తులో తేజ, సూప ర్-10 వంటి రకాల ధర రూ. 25,000-26,000 ప్రతి క్వింటాలుకు మించ గలదని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు డీలక్స్ రకాలు విక్రయించిన తరువాత తిరిగి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణమేమనగా పెద్ద వ్యాపారులు ఆగస్టులో తేజ రూ. 24,000, డిసెంబర్లో రూ. 29,000 వరకు చేరే అంచనా కలదని వీరి అభిప్రాయం.