విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరంయాసంగి సీజన్ కోసం దేశంలో నూనెగింజల విస్తీర్ణం గత ఏడాది 9.85 లక్షల హెక్టార్లతో పోలిస్తే వృద్ధిచెంది 10.18 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే వేరుసె నగ విస్తీర్ణం గత ఏడాది 5.43 ల.హె. నుండి తగ్గి 5.2 ల.హె.లకు చేరింది. త్వరలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ మరియు గుజరాత్‌లలో కొత్త పంట రాబ డులు ప్రారంభం కానున్నాయి. కాగా పంట పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండల వలన పంట కోతల సమయంలో దిగుబడిపై అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకనగా పశ్చిమబెంగాల్లోని దక్షిణ ప్రాంతాలలో త్వరగా సేద్యం అయినందున మే మొదటి వారంలో మరియు ఉత్తర ప్రాంతా లలో పంట కోతలకు జాప్యం జరిగినందున మే చివరి వారం నాటికి కోతలు ప్రారంభం కాగలవు.
తెలంగాణాలో పత్తి విస్తీర్ణం పెంచాలని ప్రణాళిక 2020-21 లో తెలంగాణాలో పత్తి విస్తీర్ణం 24 లక్షల హెక్టార్లు ఉంది. ప్రభుత్వం 28 లక్షల హెక్టార్లను అంచనా వేయడం జరిగింది. అయితే, రై తులు మిరప మరియు వరి సాగుకు మొగ్గుచూపడంతో పత్తి విస్తీర్ణం తగ్గి 18 లక్షల హెక్టార్లకు చేరింది. అక్టోబర్, 2021 ప్రారంభ సీజన్ నుండే మీడియం స్టేపుల్ పత్తి ధర రూ. 5726 ప్రతిక్వింటాలు మద్దతు ధరతో పోలిస్తే అధికంగా ఉంది మరియు గత కొన్ని వారాలుగా దేశంలోని మార్కెట్లలో రూ. 11000-12000 ప్రతి క్వింటాలు వరకు చేరింది.
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి పంట ఉత్పత్తి భారీగా పెరగడంతో పాటు మార్చి వరకు పాత నిరవధికంగా సరఫరా కావడంతో మరియు తమిళనాడు, కేరళలలో రాబ డులు పెరగడంతో పాటు ఏడాది పొడగునా సరఫరా ఉండడంతో పెద్ద కంపెనీల కొనుగోళ్లు తగ్గడంతో కొబ్బరి ధరలు పెరగడం లేదు.
దేశంలో ప్రస్తుత యాసంగి సీజన్ కోసం నువ్వుల విస్తీర్ణం 3.85 ల.హె.లతో పోలిస్తే పెరిగి 4.14 లక్షల హెక్టార్లకు చేరింది. మరియు తెలంగా ణలోని నిజామాబాద్ మరియు ఆంధ్రలోని విజయనగరం, నర్సన్నాపేట ప్రాంతా లలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై దినసరి 300-400 బస్తాలు రాబడి కాగా, ఎర్ర నువ్వులు రూ. 8600-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల నూనె మిల్లుల కోసం ప్రతి 75 కిలోల బస్తా రూ. 6800 ధరతో డెలివరి వ్యాపారం అయింది.
తమిళనాడులోని విల్లుపురం, మాయవరం, పనరుట్టి, చిదంబరం, తంజావూరు తదితర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2000-2500 బస్తాల రాబడిపై కొత్త సరుకు రూ.6000-6850, విరుధ్ నగర్ సరుకు ఎస్క్యూ చెన్నై డెలివరి రూ. 7400 ధరతో వ్యాపారమైంది.
అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ కందుల ధర సోమవారం నాడు 890 డాలర్లతో పోలిస్తే శనివారం వరకు 20 డాలర్లు తగ్గి 870 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించబడింది. కాని ముంబెలో కొత్త లెమన్ కందులు రూ. 50 బలపడి రూ. 6300, అరుశరూ. 5550-5600, మొజాంబిక్, గజరి రూ. 5500, మాలవి కందులు ఎరుపు రకం రూ. 4950-5050, మరాట్వాడా రూ.5350-5400 ధరతో వ్యాపారమైంది. అయితే దేశంలోని ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పప్పుకు గిరాకీ తక్కువగా ఉన్నందున ధరలు మందకొడిగా ఉన్నాయి.
అంతర్జాతీయ విపణిలో అనేశ్వర్ 800 డాలర్లు, పేడేశ్వర్ పెసలు 840 డాలర్లు, పొకాకో 850 డాలర్లు ప్రతి టన్ను ధరతో వ్యాపా రమైంది. దేశంలో ఏప్రిల్ 18 వరకు యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.73 ల.హె. నుండి 2 ల.హె. పెరిగి 8.62 ల.హె.లకు చేరింది.
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఉత్పత్తి పెరగడంతోస్టాకిస్టులు ముందుకు రావడం లేదు. నాఫెడ్ శనగల కొనుగోళ్లు ఉన్నప్పటికీ, మహాహారాష్ట్ర మార్కెట్లలో రైతుల సరుకు రూ. 4300-4600 ధరతో వ్యాపార మవుతున్నది. కావున కొందరు స్టాకిస్టులు కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే సరఫరా కూడా వేగంగా పెరుగుతున్నది.2022-23 సంవత్సరం కోసం ప్రభుత్వం శనగలు, కందులు, మినుములు, పెసలు సహా అపరాల ఉత్పత్తి 10 శాతం పెంచి 295 ల.ట., నిర్ధారించడంతో పాటు ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి పెరగడంతో స్టాకిస్టులు కొనుగోలు చేయడం లేదు. ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో గత వారం రూ. 75-100 ప్రతి క్వింటాలుకు క్షీణించింది.
ఉత్తరప్రదేశ్‌లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గడం వలన రైతుల అమ్మకాలు తగ్గినప్పటికీ, ధరలు పెరగడం లేదు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటే, వర్షాలు కురిసిన తరువాత రైతుల సరుకు అమ్మకాలు పెరగగలవు.
ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఆముదాల ఉత్పాదక రాష్ట్రా లలో విస్తీర్ణం తగ్గడంతో గుజరాత్‌లోని పాటన్, సిద్దాపూర్, కడి, పలంతూర్, సాబరా కాంటా, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మహసానా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలోని ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో కలిసి ప్రతిరోజు సుమారు 45-50 వేల బస్తాల సరుకు రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 6725-7000, మీడియం రూ.6400-6500, యావరేజ్ రకం రూ. 5800-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో తీవ్రమైన ఎండల కార ణంగా సరుకు రంగు వెలుస్తున్నది. రాబోవు పండుగల సీజన్లో నాణ్యమైన రంగు సరుకులకు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం మహా రాష్ట్ర సరుకు గుజరాతు ఎగుమతి అవుతున్నది.
ఆంధ్రలోని వాము ఉత్పాదక కేంద్రాలలో ఇతర రాష్ట్రాల ప్యాకింగ్ తయారీదారుల డిమాండ్ రావడంతో నాణ్యమైన వాము ధర రూ. 800-1000 పెరి గింది. మరోవైపు మధ్య ప్రదేశ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో గిరాకీ తక్కువగా ఉంది. ఎందుకనగా మధ్య ప్రదేశ్‌లో యాసంగి పంట రాబడులు ప్రారంభం అయ్యాయి.
వ్యాపారస్తుల కథనం ప్రకారం గతవారం రాజస్థాన్, మధ్య ప్ర దేశ్ మార్కెట్లలో రాబడులు తగ్గి వారంలో 2.50 లక్షల బస్తాలు, గుజరాత్లో 60-70 వేల బస్తాల ధనియాల రాబడిపై సాధారణ గిరాకీ కారణంగా ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా గుజరాత్లో ఉత్పత్తి అయిన 60 శాతం సరుకు అమ్మకం అయింది.
మరో మూడు నెలలలో కొత్త సీజన్ ప్రారంభం అవుతుంది. రంజాన్ డిమాండ్ తగ్గుచున్నందున కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. యాలకుల వేలం కేంద్రాలలో గత వారం జరిగిన వేలాలలో 8,67,933 కిలోల సరుకు రాబడి కాగా, శనివారం కేవలం 1.65 లక్షల కిలోల సరుకు రాబడి అయింది.
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది జీలకర్ర ఉత్పత్తి తగ్గడంతో మరియు ధరలు పెరగడంతో స్టాకిస్టులు మరియు కిరాణా వ్యాపా రులు నిరవధికంగా కొనుగోలు చేస్తున్నందున వారంలో గుజరాత్‌లోని అన్ని మార్కెట్లలో కలిసి 1 లక్ష బస్తాలకు పైగా మరియు రాజస్థాన్‌లో 50 వేల బస్తా లకు పైగా జీలకర్ర రాబడిపై 90 శాతం సరుకు అమ్మకం అయింది. దీనితో మే నెల వరకు ధరలు తగ్గకుంటే మరియు ఎగుమతి డిమాండ్ పెరిగితే ప్రతికిలోకు కనీసం రూ. 20 పెరుగుదలకు అవకాశం ఉంది. నాణ్యమైన సూపర్ ఫైన్ మషీన్ క్లీన్ సరుకు గరిష్టంగా రూ.30,000 వరకు చేరవచ్చు. అయితే సెప్టెంబర్ తరు వాత స్టాకిస్టుల అమ్మకాలతో పెరుగుదలకు అడ్డుకట్ట పడవచ్చు.
గత వారం ఉత్పాదక కేంద్రాలలో తీవ్ర ఎండల కారణంగా బెల్లం తయారీకి అవరోధంగా ఉంది. దీనితో మార్కెట్లలో రాబడులు తగ్గడంతో మరియు వివాహాల సీజన్ కోసం కిరాణా వ్యాపారుల డిమాండ్‌తో ధర రూ. 75-100 వృద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో 18 ఏప్రిల్ నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 15,22,172 బస్తాల నుండి 14,757 బస్తాలు తగ్గి 15,07,415 బస్తాలకు పరిమితమయ్యాయి.
గత వారం ఎన్సిడిఇఎక్స్ వద్ద ఏప్రిల్ వాయిదా రూ. 8830 వద్ద ముగిసింది. సోమవారం నాడు మే వాయిదా రూ. 9122తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 146 క్షీణించి రూ. 8976, జూనావాయిదా శుక్రవారం నాడు రూ. 9176తో ప్రారంభమైన తరువాత సాయంత్రం వరకు రూ. 88 తగ్గి రూ. 9088 వద్ద ముగిసింది.ఆంధ్ర, మహారాష్ట్రలలో రాబడులు పెరగడంతో దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 3 లక్షల బస్తాల రాబడి కారణంగా మర ఆడించే యూనిట్ల కొనుగోల్లు తగ్గడంతో మరియు ఎగుమతులు సాధారణ స్థాయిలో ఉన్నందున ధరలు మంద కొడిగా మారాయి.
దేశంలోని అన్ని మిరప ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి వారంలో సుమారు 10 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడిపై 90 శాతం అమ్మకమైంది.గుంటూరు మార్కెట్లో గత వారం 5 రోజుల మార్కెట్లో 4.70 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై మీడియం, మీడియం బెస్ట్ రకాలు అధికంగా ఉన్నాయి. మరియు 4 లక్షల బస్తాల అమ్మకంపై తేజ మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 1000-2000, తేజ తాలు రూ. 500 తగ్గాయి. ఇందుకు ముఖ్య కార ణమేమనగా, చైనా, బంగ్లాదేశ్ మొదలగు మిరప దిగుమతి దేశాల ద్వారా డిమాండ్ తగ్గడంతో పాటు స్థానిక యూనిట్ల కోసం డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లలో వీటి రాబడి కేవలం 10-15 శాతం అవుతున్నాయి. తీవ్ర ఎండల కారణంగా మే 9 నుండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఒక నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించనున్నది.
బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 14, ఏప్రిల్ నుండి 30, సెప్టెంబర్, 2022 వరకు విదేశాల నుండి దిగుమతి అయ్యే పత్తిపై ఎలాంటి దిగుమతి సుంకం ఉండదు. కేంద్ర ఉత్పత్తులు మరియు కస్టమ్స్ సుంకం బోర్డు సిబిఐసి) వారు ఈ సందర్భంగా ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఇది వెంటన్ అమలులోకి వస్తుందని తెలిపారు.
సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్ల సమాఖ్య వారి వివరాల ప్రకారం ప్రస్తుత వంటనూనె సంవత్సరం మొదటి ఐదు నెలలు అనగా నవంబర్, 2021 నుండి మార్చి, 2022 లో వంటనూనెల దిగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.40 లక్షల టన్నుల నుండి 4 లక్షల టన్నులు పెరిగి 56.42 లక్షల టన్నులకు చేరాయి. ఇందులో మార్చి, 2022లో దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే 9.83 లక్షల టన్నుల నుండి 68,000 టన్నులు పెరిగి 10,51,000 టన్నులకు చేరాయి.
లభించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 1000-1500 బస్తాలు, చాగలమర్రి, ఆర్లగడ్డ, మైదుకూరు ప్రాంతాలలో 4-5 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై నలుపు రకం రూ. 9,200-9,300, తెల్ల నువ్వులు రూ. 10,500-10,600, విరుధ్‌నగర్ డెలివరి జిఎస్టి సహా 75 కిలోల బస్తా రూ. 7200, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలలో 50-100 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9200-9300 ధరతో వ్యాపారమైంది.
దేశంలోని ప్రముఖ ఉద్పాదక రాష్ట్రలలో చిన్న మరియు మధ్య తరగతి రైతుల సరుకు భారీగా రాబడి అవుతున్నందున ధరలు పెరగడంలేదు . సీజన్ ప్రారంభం నుండే మిల్లర్లు అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు రూ. 100-150 హెచ్చుతగ్గులూ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాలలోని పెద్ద వ్యాపారస్తులు ధరలుతక్కవగా ఉన్నందున సరుకు నిల్వ చేస్తూన్నారు.
దేశంలో వేసవితాపంతో బెల్లానికి గిరాకీ కొరవడింది. అయితే వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వచ్చే వారం నుండి గిరాకీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని కోల్డ్ స్టోరేజీల సరుకు కూడా మే 15 తరువాత బయటకు రావడం ప్రారంభం కాగలదు. అంతవరకు మార్కెట్లలో రైతుల సరుకు రాబడి సమాప్తం కావడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రలలో కూడా బెల్లం తయారీ కార్యక్రమం మందకొడిగా మారుతున్నది. రైతులు ఇంతకు ముందు తయారు చేసిన సరుకును మార్కెట్లకు తరలిస్తున్నందున గత వారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
వేసవి సీజన్ కారణంగా పప్పు అమ్మకాలు పెరగడంలేదు. మధ్య తరగతి రైతులు తమసరుకు విక్రయిస్తున్నందున ధరలు స్థిరంగా ఉన్నాయి. జూన్ తరువాత గిరాకి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లలలో రాబడులు నామ మాత్రంగా ఉండడంతో ధరలు 8-10 శాతం పెరగవచ్చు. ఎందుకనగా దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నందున మయన్మార్ వ్యాపారులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. ముంబెలో కొత్త లెమన్ కందులు రూ.50 తగ్గి రూ.6250, అరుశ రూ. 5500-5600, మాలవి కందులు ఎరుపు రకం రూ. 4950-5000, మొజాంబిక్ తెలుపు రకం రూ.5450-5500, మట్వాడా రూ. 5350-5400 ధరతో వ్యాపారమెంది.
బఠానీల మాదిరిగా శనగల ధరలు ఉండడంతో బెసన్ మిల్లర్ల కొనుగోళ్ళు పరిమితంగా ఉన్నాయి. ఉత్పత్తి పెరగడంతో స్టాకిస్టులు ముందుకు రావడం లేదు. ధరలు తక్కువగా ఉన్నందున రైతులు కూడ మార్కెటకు తక్కువగా సరుకు తరలిస్తున్నారు.